
కొమురవెల్లి నుంచి బస్సులు నడపాలి
గజ్వేల్‌రూరల్: కొమురవెల్లి నుంచి హైదరాబాద్‌కు బస్సులను నడపాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు బాలకిషన్ కోరారు. జీపీపీ(గజ్వేల్–ప్రజ్ఞాపూర్) ఆర్టీసీ డిపో కంట్రోలర్ రామచంద్రంకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొమురవెల్లి నుంచి కొండపోచమ్మ– జగదేవ్‌పూర్ మీదుగా ఈసీఐఎల్ వరకు, అదే విధంగా మునిగడప వయా తిమ్మాపూర్–రాయవరం–కొడకండ్ల–ప్రజ్ఞాపూర్ మీదుగా హైదరాబాద్‌కు బస్సులను నడిపించాలని కోరామన్నారు. ఈ రూట్లో బస్సు సౌకర్యం కల్పించడం వల్ల భక్తులకు ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. ఆయా రూట్లను పరిశీలించి బస్సులను నడిపించేందుకు చర్యలు తీసుకుంటామని కంట్రోలర్ చెప్పారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు దాసు, సంపత్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
కేవీపీఎస్ జిల్లా నేత బాలకిషన్