
అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
సదాశివపేట(సంగారెడ్డి): సదాశివపేట ప్రాంతం పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోందని అగ్ని ప్రమాదాలపట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ ఎమర్జెన్సీ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ నారాయణరావు పేర్కొన్నారు. ఎంఆర్‌ఎఫ్ పరిశ్రమ సీఆర్‌ఎస్ నిధులతో సదాశివపేట అగ్నిమాపక కేంద్రం ఆవరణలో నిర్మించిన అగ్నిమాపక కేంద్రం నూతన భవనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం అగ్నిమాపక కేంద్రం ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...అగ్నిమాపక కేంద్రం పరిధిలో 552 అగ్ని ప్రమాదాలు జరిగాయని 28 అత్యవసర రక్షణ చర్యలు చేపట్టారన్నారు. అగ్నిప్రమాద రక్షణ చర్యల్లో భాగంగా రూ.80.74 కోట్ల విలువైన ఆస్తులను కాపాడినట్లు తెలిపారు.
హరికథ చెప్పిన
కరాటే కల్యాణి
సదాశివపేట(సంగారెడ్డి): దేవీశరన్నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని గురునగర్ కాలనీ శ్రీనవదుర్గ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపం వద్ద సోమవారం రాత్రి కరాటే కల్యాణి హరికథ కాలక్షేపం నిర్వహించారు. శివపార్వతుల కల్యాణం, సుబ్రహ్మణ్యవల్లి దేవసేన కల్యాణ మహత్మ్యానికి సంబంధించిన ఘట్టాలను హరికథగా చెప్పారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో కోవూరినాగరాజ్‌గౌడ్, కోడూరి శరత్‌చంద్ర, నవదుర్గ యూత్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నల్లపోచమ్మదేవి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలో తునికి శ్రీనల్లపోచమ్మదేవి ఆలయంలో ఎమ్మెల్యే సునీతారెడ్డి మంగళవారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి ఎమ్మెల్యే రావడంతో ఆలయ అధికారులు, పూజారులు స్వాగతం పలికారు. అనంతరం నల్లపోచమ్మదేవికి ఎమ్మెల్యే కుంకుమార్చన చేశారు. పూజలు అనంతరం ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు సారరామాగౌడ్, నాయకులు సాయాగౌడ్, ఎల్లం, ప్రవీణ్‌కుమార్, కిశోర్‌గౌడ్, అమర్‌సింగ్, సంజీవ్, చంద్రయ్య, రామానుజం తదితరులు పాల్గొన్నారు.
పూర్తయిన రైల్వే బ్రిడ్జి
మరమ్మతులు
నేటి నుంచి పునఃప్రారంభం
హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని శమ్నాపూర్ శివారులో ఆగస్టు 28న కురిసిన భారీ వర్షాలకు రైల్వేబ్రిడ్జి కొట్టుకుపోయిన విషయం తెల్సిందే. దీంతో గత కొంత కాలంగా బ్రిడ్జి మరమ్మతులు చేసేందుకు భారీ వర్షాలు కురుస్తుండటంతో పనులకు అంతరాయం ఏర్పడగా ఎట్టకేలకు పనులు పూర్తి చేసి బుధవారం నుంచి మెదక్ రైల్వే రాకపోకలు కొనసాగించనున్నారు. ఈ మేరకు రైల్వే అధికారులు మంగళవారం విలేకరులకు తెలిపారు.

అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి