
జలదిగ్బంధంలో గౌడ్‌గాం జన్‌వాడ
నారాయణఖేడ్: కర్ణాటక, మహారాష్ట్రలతోపాటు ఎగువన కురిసిన వర్షాలతో మంజీరా నదిలోకి భారీగా వరద చేరుతుండటంతో బ్యాక్ వాటర్ కారణంగా నాగల్‌గిద్ద మండలం గౌడ్‌గాం జన్‌వాడ జలదిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామం వరకు సోమవారం అర్థరాత్రి బ్యాక్‌వాటర్ రావడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. గ్రామంలో సుమారు 50 కుటుంబాల్లో 250మంది వరకు నివసిస్తున్నారు. వీరికి కర్ణాటక ప్రాంతంలోని జమ్గి, కందుగుల్ తదితర ప్రాంతాల్లో బంధుత్వాలు ఉండటంతో చాలామంది అక్కడే నివాసం ఉంటున్నారు. కొందరు యువకులు, వృద్ధులు గ్రామంలో ఉండగా బ్యాక్ వాటర్‌తో గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకోవడతో వృద్ధులు, ఇతరులు జమ్గి, కందుగుల్‌తోపాటు బీదర్ ప్రాంతంలోని తమ బందువుల ఇళ్లకు వెళ్లిపోయారు. గౌడ్‌గాం జన్‌వాడ నుంచి ఔదత్‌పూర్, ఏస్గి గ్రామాలకు వచ్చేందుకు వంతెనవద్ద నీరు భారీగా రావడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో జనాలు కర్ణాటకలోని గ్రామాలకు వెళ్లాల్సి వచ్చింది. యువకులు కొందరు గ్రామంలోనే ఉన్నారు. రాత్రి నీటి ఇబ్బందుల దృష్ట్యా కర్ణాటకలోని కందుగుల్‌లోని ప్రాథమిక పాఠశాలలో గ్రామస్తులు తల దాచుకున్నారు.
హుటాహుటిన ఎమ్మెల్యే సందర్శన
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి సోమవారం రాత్రి 12గంట ప్రాంతంలో గ్రామానికి వెళ్లారు. ఔదత్‌పూర్ నుంచి వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో కర్ణాటకలోని జమ్గి, కందుగుల్ ద్వారా ట్రాక్టర్‌లో నీటిలో ప్రయాణించి గ్రామానికి చేరుకుని వారికి ధైర్యం చెప్పారు. ఏదైనా సమస్య వస్తే తనకు గానీ, టోల్‌ఫ్రీ నంబరు 101కు గానీ ఫోన్ చేయాలని సూచించారు. మంగళవారం ఉదయం సబ్‌కలెక్టర్ ఉమాహారతి, డీఎస్పీ వెంకట్‌రెడ్డి, ట్రాక్టర్‌పై కందుగుల్ నుంచి వెళ్లి గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో పరిస్థితిని పర్యవేక్షించారు. ఖేడ్ ఆర్టీసీడిపోలో సుదీర్ఘకాలం కండక్టర్‌గా విధులు నిర్వర్తించి కంట్రోలర్‌గా పదవీ విరమణ పొందిన రాములును సంజీవరెడ్డి సన్మానించారు.
గ్రామం చుట్టూ చేరుకున్న
మంజీరా బ్యాక్‌వాటర్
కర్ణాటకలోని కందుగుల్‌కు
గ్రామస్తుల తరలింపు

జలదిగ్బంధంలో గౌడ్‌గాం జన్‌వాడ