
వెళ్లిరా బతుకమ్మా!
సద్దుల బతుకమ్మ వేడుకలను సంగారెడ్డి మండలంలో ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను భక్తిశ్రద్ధలతో పేర్చారు. మహిళలంతా ఒక చోట చేరి ఆడి పాడుతూ సంబరాలు చేసుకున్నారు. తాళ్లపల్లి గ్రామంలో డీజే పాటలతో, మహిళలు కోలాటాలు వేస్తూ ఘనంగా జరుపుకున్నారు. హత్నూర మండలంలోని గోవిందరాజు పల్లి, లింగాపూర్, తదితర గ్రామాలలో మహిళలు పెద్ద ఎత్తున పూలతో బతుకమ్మ పేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించి బతుకమ్మ ఆటపాటలతో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు.
– సంగారెడ్డి టౌన్/హత్నూర (సంగారెడ్డి):