సాయుధ కారాగారంలో ఆయుధపూజ
సంగారెడ్డి జోన్: జిల్లా పోలీస్ సాయుధ కారాగారంలో ఆయుధ పూజను మంగళవారం ఘనంగా నిర్వహించారు. దుర్గాష్టమి పురస్కరించుకుని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛరణల మధ్య ఆయుధాలతోపాటు వాహనాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...నెల రోజుల పాటు (అక్టోబరు 1వ తేదీ నుంచి 31 వరకు) 30, 30(ఎ) పోలీసు యాక్ట్–1861 అమలులో ఉంటుందన్నారు. అనుమతి లేనిదే ఎవరూ ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు.
పూజలో పాల్గొన్న జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్


