ఎల్లాపూర్ బ్రిడ్జిపై మొసలి
పాపన్నపేట(మెదక్): మండలంలోని ఎల్లాపూర్ బ్రిడ్జి రెయిలింగ్‌పై సోమవారం మొసలి కనిపించిందని స్థానికులు తెలిపారు. రెండు రోజులుగా మంజీర వరదలు బ్రిడ్జిని ముంచెత్తాయి.దీంతో వాహనాల రాక పోకలు నిలిపివేశారు. ఈ క్రమంలో సింగూర్ ప్రాజెక్టు నుంచి మొసలి పిల్ల కొట్టుకు వచ్చి బ్రిడ్జి రెయిలింగ్ పట్టుకొని ఉండవచ్చని భావిస్తున్నారు. సోమవారం బ్రిడ్జిపై రాక పోకలు ప్రారంభించడంతో అటుగా వెళ్తున్న ఎల్లాపూర్ వాసులు గమనించారు. దగ్గరగా వెళ్తుండగా నీటిలోకి దూకిందని చెప్పారు. ఈ విషయమై ఎస్సై శ్రీనివాస్‌గౌడ్‌ను వివరణ కోరగా ఈ ఘటన తమ దృష్టికి రాలేదన్నారు.
బెజ్జంకి(సిద్దిపేట): కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. స్థానికుల కథనం ప్రకారం... కరీంనగర్‌కు చెందిన 8 మంది దుర్గామాత దీక్షాధారులు అదే జిల్లాలోని ఖాసీంపేటలోని మానసాదేవి ఆలయానికి సోమవారం వెళ్లారు. అమ్మవారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో మండలంలోని వడ్లూరు వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. సమీపంలోనే పెద్ద వ్యవసాయ బావి ఉంది. చెట్టుకు ఢీకొని కారు ఆగడంతో పెను ప్రమాదం తప్పింది. భక్తులకు ఎవరికి గాయాలు కాలేదు.


