
ప్రవేశాలు ఫుల్.. వసతులు నిల్
హత్నూర ఐటీఐలో అన్నీ సమస్యలే శిథిలావస్థకు చేరిన భవనం విద్యుత్ సమస్యతో ట్రేడ్లలో పనిచేయని మెషీన్లు తాగునీరు, మరుగుదొడ్లు లేక విద్యార్థుల తిప్పలు
హత్నూర( సంగారెడ్డి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఐటీఐలను బలోపేతం చేసేందుకు చుట్టినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇంకా సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఒకప్పుడు హత్నూర ఐటీఐ అంటే జిల్లాలోనే ఎంతో గుర్తింపు పొందింది. ప్రస్తుతం విద్యార్థులు అడ్మిషన్లు పూర్తిస్థాయిలో నిండాయి కానీ వస్తువులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దశాబ్దాల క్రితం నిర్మించిన హత్నూర ఐటీఐ భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. అయినా అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు.ఐటీఐలో విద్యార్థుల అడ్మిషన్ల పూర్తిస్థాయిలో నిండాయి. విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా వస్తువులు లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
శిక్షణ పొందుతున్న 480 మంది విద్యార్థులు
ఎలక్ట్రిషన్, మోటర్ మెకానిక్ వెహికల్, వెల్డర్, టర్నర్, ఫిట్టర్, కోప, ఇస్నిస్ట్ గ్రైండర్, మెషీనిస్ట్ కాంపోజిట్ 8 విభాగాల్లో ప్రస్తుతం 480 మంది విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. వీరికి ఆరుగురు ఇన్‌స్ట్రక్టర్లు మాత్రమే శిక్షణనిస్తున్నారు. ఇంకో నలుగురు ఇన్‌స్ట్రక్టర్ల అవసరం ఉంది.
రా మెటీరియల్ కరువు.
ఐటీఐలో విద్యార్థులకు ప్రాక్టికల్స్ (ప్రయోగాలు) చేయించేందుకు ప్రభుత్వం రా మెటీరియల్ సరఫరా చేయకపోవడంతో కొన్ని నెలలుగా విద్యార్థులతో ప్రయోగాలు చేయించడంలేదు. ప్రస్తుతం థియరీ మాత్రమే బోధిస్తున్నారు.