
సరస్వతీదేవిగా అమ్మవారు
న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 30 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు సోమవారం అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని నవపాన్ సమీపంలో ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ వారు, ఎంజీ రోడ్డులోని మహంకాళి దేవాలయంలో అమ్మవారు, టోల్‌గేట్ సమీపంలోని శ్రీ రామలింగేశ్వర దేవస్థానంలో అమ్మవారు భక్తులకు చదువుల తల్లి సరస్వతి దేవిగా దర్శమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు కుంకుమార్చన, నిర్వహించారు. అనంతరం చిన్నారులకు పుస్తకాలను పలకలు అందజేశారు. – పటాన్‌చెరు టౌన్

సరస్వతీదేవిగా అమ్మవారు