
కరెంటు రాక ఆగిన ప్రయోగాలు
దశాబ్దాల క్రితం నిర్మించిన భవనం పూర్తిగా శిథిలవస్థకు చేరి ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. విద్యార్థులకు శిక్షణ ఇచ్చే ట్రేడ్లు భవనాలు పైకప్పు రేకులు పూర్తిగా పాడైపోయి రంధ్రాలు పడ్డాయి. కొన్ని నెలలుగా విద్యుత్ సరఫరా కొన్ని ట్రేడ్లలోకి రాకపోవడంతో మెషీన్లు నడిపించలేక విద్యార్థులతో ప్రయోగాలు చేయించడం లేదు. కనీసం విద్యార్థులకు తాగేందుకు నీళ్లు కూడా లేవు. మూత్రశాలలు మరుగుదొడ్లు పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు, సిబ్బంది నిత్యం ఇబ్బందులకు గురవుతున్నారు. సిబ్బంది కోసం కట్టిన క్వార్టర్లు, హాస్టల్ భవనం సైతం కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి.