
అనుమానాస్పదంగా వ్యక్తి మృతి
సంగారెడ్డి టౌన్ : అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై రవీందర్ వివరాల ప్రకారం... కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా చంద్రాస్ లాడ్జి వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడికి 42 ఏళ్లు ఉంటాయని, ఒంటిపై బ్లూ కలర్ షర్టు, ఎడమ చేతిపై ఔ అనే అక్షరంతో పచ్చబొట్టు ఉన్నదని తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మాసాయిపేటలో అనార్యోగంతో..
చేగుంట(తూప్రాన్): అనారోగ్యంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల కేంద్రమైన మాసాయిపేటలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధరప్రదేశ్ చిలుకలూరిపేటకు చెందిన కై లా విజయ్‌కుమార్(38) రెండేళ్లుగా మాసాయిపేట సఫ్రాన్ వ్యాలీలో వంట మినిషిగా పని చేస్తున్నాడు. ఇటీవల కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ్‌కుమార్ శనివారం రాత్రి విధులు ముగించుకొని పడుకున్నాడు. ఆదివారం ఉదయం అక్కడే పనులు చేసే మేసీ్త్ర కృష్ణ అతడ్ని నిద్ర లేపేందుకు ప్రయత్నించాడు. అతడు లేవకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నిజాంపేట్ మండలంలో మృతదేహం..
కల్హేర్(నారాయణఖేడ్): నిజాంపేట్ మండలం నాగధర్ మొదళ్లకుంట తండా వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కల్హేర్ ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి వివరాల ప్రకారం... ఆదివారం వాగులో కొట్టుకొచ్చి వంతెన కింద ఉంది. వివరాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.