
ధర్మం, జాతీయత ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యం
గజ్వేల్‌రూరల్: ధర్మం, జాతీయతా భావం కోసం పనిచేస్తూ నిలబడే సంస్థ ఆర్‌ఎస్‌ఎస్(రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) ఒక్కటేనని తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేశ్ పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ స్థాపించి 100 సంవత్సరాలైన సందర్భంగా పట్టణంలోని ఎస్ కన్వెన్షన్‌లో ఆదివారం శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన బుక్క రమేశ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ప్రపంచంలో చాలా సంస్థలు ఉద్భవించినప్పటికీ వందేళ్ల పాటు లక్ష్యం కోసం నిలబడింది ఆర్‌ఎస్‌ఎస్ మాత్రమేనని గుర్తు చేశారు. 1925లో విజయదశమి రోజున డాక్టర్ కేశవరావ్ బలీరామ్ హెడ్గేవర్ చేతుల మీదుగా పురుడుపోసుకున్నట్లు తెలిపారు. దేశంలో ఉన్న ప్రతి పౌరుడిని జాతీయ భావాలు కలిగిన పౌరులుగా తయారు చేసే బాధ్యతను భుజాన వేసుకొని ధర్మాన్ని కాపాడుతూ, ఎక్కడైనా విపత్తులు సంభవించినప్పుడు ప్రజలకు ఆర్‌ఎస్‌ఎస్ అండగా నిలుస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక సమరసతా వేదిక తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు డాక్టర్ నరేశ్‌బాబు, వివిధ సంఘాల బాధ్యులు, మహిళలు, స్వయం సేవకులు పాల్గొన్నారు.

ధర్మం, జాతీయత ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యం