
ఒక్కేసి.. పువ్వేసి
జోగిపేటలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు
జోగిపేట(అందోల్): జోగిపేట పట్టణంలో ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ పండుగను జోగిపేటలో అష్టమి కంటే ముందు రోజు సద్దుల బతుకమ్మను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గునుగు, తంగేడి, బంతి, చామంతి పువ్వులతో బతుకమ్మలను పేర్చారు. సాయంత్రం వేళలో ఇంటి ముందు, అనంతరం మార్కెట్ యార్డు ప్రాంగణంలో బతుకమ్మ ఆడారు. వేద పండితులతో బతుకమ్మలకు పూజలు నిర్వహించి, అందోలు పెద్ద చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. అనంతరం మహిళలు ఒకరినొకరు వాయినాలు ఇచ్చుకుంటూ పండుగ శుభాకాంక్షలను తెలియజేసుకున్నారు. సాధారణంగా జోగిపేట మహిళలు అందోలు చెరువులో నిమజ్జనం చేస్తారు. అయితే నీరు ఎక్కువగా ఉండటంతో ఈసారి సొంతంగా నిమజ్జనం చేసే అవకాశం లేకుండా పోయింది. బతుకమ్మలను గజ ఈత గాళ్లు నిమజ్జనం చేసేలా అధికారులు ఏర్పాటు చేశారు.
జోగిపేటలో ఘనంగా
బతుకమ్మ పండగ
అందోలు పెద్ద చెరువులో నిమజ్జనం,
బారికేడ్ల ఏర్పాటు

ఒక్కేసి.. పువ్వేసి

ఒక్కేసి.. పువ్వేసి