
పేదల సంక్షేమానికి కృషి
నారాయణఖేడ్/న్యాల్‌కల్(జహీరాబాద్)/జహీరాబాద్: పేదల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని ఎంపీ సురేశ్ షెట్కార్ పేర్కొన్నారు. జహీరాబాదు పార్లమెంటు పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ఎనిమిది మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ కింద రూ.4లక్షల విలువైన చెక్కులను ఆయన నివాసంలో అందజేశారు. అనంతరం ఖేడ్‌లోని సత్యసాయి కాలనీలోని, ఖేడ్ మండలం పీర్లతండాలోని కట్టమైసమ్మ ఆలయాలను సురేశ్ షెట్కార్ తన సతీమణి ఉమాదేవితో కలిసి సందర్శించుకున్నారు. మహాచండీదేవి రూపంలో అలంకరించిన అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యం, పట్టువస్త్రాలను సమర్పించారు. అంతకుముందు న్యాల్‌కల్ మండలంలోని మిర్జాపూర్ గ్రామానికి చెందిన రైతు జగన్నాథ్‌రెడ్డి కుమార్తె అఖిలజారెడ్డి గ్రూప్–1 సర్వీస్‌లో డీఎస్పీగా ఎంపికై నందున జహీరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమెను ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తమ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాల భర్తీకి పెద్ద పీట వేస్తోందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్‌చార్జి శుక్లవర్ధన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ ప్రసిడెంట్ తిరుపతిరెడ్డి, మాజీ జెడ్పీటీసీలు నిరంజన్, సంగీత షెట్కార్, ముఖ్యనాయకులు సుభాష్ పటేల్, జగ్గప్ప, నారాయణ, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ సురేశ్ షెట్కార్