
ప్రతీ ఇంటికి సురక్షిత నీరు
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
పటాన్‌చెరు/పటాన్‌చెరు టౌన్: ప్రతీ ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. అమీన్‌పూర్ మున్సి పల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట మైత్రివిల్లాస్ కాలనీలో ఆదివారం ఇంటింటికీ మంచినీటి సరఫరాను ఆయన ప్రారంభించారు. అదేవిధంగా అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీల్లో తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగి జాతీయ రహదారి నుంచి విజేత కాలనీ వరకు రూ.4.50కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.