గ్రీవెన్స్‌ డేకు 18 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

గ్రీవెన్స్‌ డేకు 18 ఫిర్యాదులు

Oct 7 2025 3:59 AM | Updated on Oct 7 2025 3:53 PM

సిరిసిల్ల క్రైం: బాధితులకు భరోసాగా ఉండేందుకు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ప్రతీ సోమవారం గ్రీవెన్స్‌ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేశ్‌ బీ గీతే తెలిపారు. 18 ఫిర్యాదులు స్వీకరించినట్లు వివరించారు. ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులకు ఫోన్‌చేసి ఆదేశించారు.

న్యాయసేవల క్లినిక్‌ ప్రారంభం

సిరిసిల్లకల్చరల్‌: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రాజీవ్‌నగర్‌ బస్తీ ఆస్పత్రిలో న్యాయ సేవల క్లినిక్‌ను సంస్థ జిల్లా కార్యదర్శి రాధికా జైస్వాల్‌ సోమవారం ప్రారంభించారు. డ్రగ్‌ అవేర్‌నెస్‌, వెల్‌నెస్‌, నేవిగేషన్‌ ఫర్‌ డ్రగ్‌ ఫ్రీ ఇండియా(డాన్‌)లో భాగంగా మత్తు పదార్థాలకు బానిసలైన వారిని గుర్తించి స్వస్థత చేకూర్చేందుకు ఈ కేంద్రం పనిచేస్తుందని తెలిపారు. లోక్‌ అదాలత్‌ సభ్యుడు చింతోజు భాస్కర్‌, మా నసిక వైద్య నిపుణుడు ప్రవీణ్‌, డాక్టర్‌ మణివర్మ, నర్సింగ్‌ ఆఫీసర్‌ స్వాతి పాల్గొన్నారు.

రోడ్డు కబ్జాను అడ్డుకోండి 

సిరిసిల్లటౌన్‌: రోడ్డు కబ్జా చేసి నిర్మిస్తున్న భవనం పనులు అడ్డుకోవాలని ఏఐఎఫ్టీయూ న్యూ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోమిశెట్టి దశరథం కోరారు. మున్సిపల్‌ ఎదుట సోమవారం నిరసన తెలిసిన సందర్భంగా మాట్లాడారు. విద్యానగర్‌ నుంచి తాడూరు వెళ్లే దారిలో సర్వేనంబర్‌ 526లో రోడ్డును ఆక్రమించి భవనం నిర్మిస్తున్నారన్నారు. వెంటనే ఆ నిర్మాణాన్ని అడ్డుకోవాలని కోరారు. కొత్తచెరువు నాలాలు, శాంతినగర్‌ రోడ్‌ డ్యామ్‌ ఆక్రమణలపై విచారణ చేపట్టాలని కోరారు. కొంపల్లి విజయ్‌కుమార్‌, తడుక రాములు, గుజ్జ దేవదాస్‌, సత్తయ్య, శ్రీధర్‌ పాల్గొన్నారు.

తెల్లవార్లూ కురిసిన వర్షం

సిరిసిల్ల: ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు వర్షం కురిసింది. కోనరావుపేటలో అత్యధికంగా 56.0 మిల్లీమీటర్లు కురిసింది. సిరిసిల్లలో 50.7, రుద్రంగిలో 28.7, చందుర్తిలో 24.4, బోయినపల్లిలో 17.8, వేములవాడలో 47.6, వీర్నపల్లిలో 27.6, వేములవాడ రూరల్‌లో 19.7, ఎల్లారెడ్డిపేటలో 42.0, గంభీరావుపేటలో 41.5, ముస్తాబాద్‌లో 43.4, తంగళ్లపల్లిలో 25.1, ఇల్లంతకుంటలో 10.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో 33.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.

కష్టపడిన వారికి గుర్తింపు

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పార్టీలో దశాబ్దకాలంగా కష్టపడి పనిచేస్తున్న వారికి గుర్తింపు ఉంటుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కాంగ్రెస్‌ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి కోరారు. ఎల్లారెడ్డిపేటలోని పార్టీ ఆఫీ స్‌లో సోమవారం ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల కార్యకర్తలతో సమావేశమయ్యారు. రెండు మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అన్ని స్థానాలు కైవసం చేసుకోవాలన్నారు. రాచర్లగొల్లపల్లికి చెందిన 50 మంది కాంగ్రెస్‌లో చేరారు. బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, ఏఎంసీ చైర్మన్లు సాబేరా బేగం, రాములునాయక్‌, వైస్‌చైర్మన్లు గుండాడి రాంరెడ్డి, లక్ష్మణ్‌, పార్టీ మండలాధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, భూత శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

జిల్లా సరిహద్దుల్లో తనిఖీ

వేములవాడరూరల్‌: రాజన్నసిరిసిల్ల–జగిత్యాల జిల్లా సరిహద్దు మండలంలోని ఫాజుల్‌నగర్‌ వద్ద పోలీసులు సోమవారం రాత్రి తనిఖీలు చేపట్టారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడంతో వాహనాలను ఆపి తనిఖీ చేశారు. రూ.50వేలకు మించి నగదు తరలిస్తే సీజ్‌ చేస్తామని ఎస్సై వెంకట్రాజం తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి, ధ్రువీకరణ పత్రాలు సరిగా లేని వారికి జరిమానా విధించారు.

అన్నపూర్ణలో 3.38 టీఎంసీలు

ఇల్లంతకుంట(మానకొండూర్‌): అనంతగిరి అన్నపూర్ణ జలాశయం సామర్థ్యం 3.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.38 టీఎంసీలకు చేరింది. ఎత్తిపోతలు నిలిపివేసినట్లు ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు.

గ్రీవెన్స్‌ డేకు 18 ఫిర్యాదులు1
1/1

గ్రీవెన్స్‌ డేకు 18 ఫిర్యాదులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement