
పొన్నరథంపై గోవిందుడు
● తిరువీధుల్లో తిలకించిన భక్తజనం ● మిన్నంటిన గోవింద నామస్మరణం
సిరిసిల్లటౌన్: అశేష భక్తుల గోవిందనామస్మరణతో శ్రీశాల తిరువీధులు పులకించాయి. ఎనిమిది రోజులుగా సాగుతున్న శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి పొన్నరథోత్సవం జరిగింది. తిరుమలేశుని అనుబంధ ఆలయమైన సిరిసిల్ల తిరువీధుల్లో గోవిందుని రూపంలో శ్రీవారు పొన్న రథంపై విహరించారు. ఈసందర్బంగా సాయంత్రం 6గంటల నుంచే పొన్నవాహన ఉత్సవాలు నిర్వహించారు. కళాకారుల కోలాటాలు, భజన సంకీర్తనలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. రాత్రి 9 గంటలకు ప్రారంభమైన పొన్నరథాన్ని లాగడానికి భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, ఈవో మారుతిరావు, ఏఈవోలు కూనబోయిన సత్యం, పీసరి రవీందర్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు ఉప్పుల విఠల్‌రెడ్డి, చేపూరి నాగరాజు, తీగల శేఖర్‌గౌడ్, అర్చకస్వాములు కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు.
కాళింగమర్దనంపై దేవదేవుడు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 11 గంటలకు కాలింగమర్ధన సేవ నిర్వహించారు. గోవిందా నామస్మరణతో మాడవీధులు పులకించిపోయాయి. కాళింగమర్దనంపై విచ్చేసిన దేవదేవుడికి భక్తులు మంగళహారతులతో నీరాజనం పలికారు.
పొన్నసేవపై విహరిస్తున్న శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులు
కాళింగమర్దనంపై విహరిస్తున్న శ్రీవారు

పొన్నరథంపై గోవిందుడు