
ఇలాగైతే ఆడేదెలా ?
● ఏళ్లుగా కొనసాగుతున్న మినీస్టేడియం పనులు ● త్వరగా పూర్తిచేయాలంటున్న క్రీడాకారులు
వేములవాడఅర్బన్: గ్రామీణ ప్రాంతంలోని క్రీడాకా రుల్లో నైపుణ్యం పెంపు.. వారి టాలెంట్‌ను గుర్తించేందుకు చేపట్టిన మినీ స్టేడియం పనులు ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఆటలు ఆడేందుకు కనీ స సౌకర్యాలు లేక క్రీడాకారులు ఇబ్బంది పడుతున్నారు. వేములవాడలో 2014లో ప్రారంభించిన మినీస్టేడియం పనులు ఇంకా పూర్తికాలేదు. ఫలితంగా క్రీడాకారులకు మౌలిక వసతులు దరిచేరడం లేదు.
రూ.2.10కోట్లతో 2014లో..
వేములవాడ మున్సిపల్ పరిధి నాంపల్లి శివారులో 5 ఎకరాల విస్తీర్ణంలో 13 జూలై 2014న అప్పటి ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, అప్పటి స్పీకర్ మధుసూదనాచారి చేతుల మీదుగా రూ.2.10కో ట్లతో మినీస్టేడియం పనులు ప్రారంభించారు. సగం పనులు చేసిన కాంట్రాక్టర్ తర్వాత పట్టించుకోలేదు. రెండేళ్ల క్రితం మళ్లీ రూ.5కోట్లు మంజూరు కావడంతో మళ్లీ కొంత మేరకు పనులు చేసి నిలిపివేశారు. ఇటీవల మళ్లీ పనులు ప్రారంభించారు.
చేయాల్సిన పనులు ఇవే..
మినీస్టేడియంలో క్రీడాకారుల కోసం ఆట స్థలం, ఆటలపోటీలను చూసేందుకు హాల్, ఇండోర్ స్టేడియం, సిబ్బంది కార్యాలయాలు, క్రీడాకారులకు స్నాన గదులు నిర్మించాల్సి ఉంది.