
పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి
● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కోరారు. మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం నిర్వహించిన బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల పలు సర్వేసంస్థలు, పార్టీ సర్వేల ప్రకారం 95 శాతానికి పైగా సీట్లు బీఆర్‌ఎస్ గెలుస్తుందని చెప్పినట్లు గుర్తు చేశారు. టికెట్లు దక్కని వారు నిరాశ పడొద్దని కోరారు. పార్టీ అందరికీ అవకాశాలు ఇస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ బాకీకార్డులపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని కోరారు. ఎల్లారెడ్డిపేట జెడ్పీటీసీ స్థానానికి చీటి రజిత–లక్ష్మణ్‌రావు, గుండారపు లహరి–కృష్ణారెడ్డి, పాశం సరోజన–దేవరెడ్డి, గుల్లపల్లి పద్మ–నర్సింహారెడ్డి, ఇల్లందుల గీతాంజలి–శ్రీనివాస్‌రెడ్డి ఆశిస్తున్నట్లు గుర్తించామన్నారు. పోటీలో ఇంకెవరైనా ఉంటే తమకు తెలపాలని కోరారు. 13 ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు తమ పేర్లను ఇచ్చారు. బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు వరస కృష్ణహరి, సింగిల్‌విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ పిల్లి రేణుక, నాయకులు అందె సుభాష్, ఎడ్ల సందీప్ పాల్గొన్నారు.