అభ్యర్థుల గెలుపే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

అభ్యర్థుల గెలుపే లక్ష్యం

Oct 6 2025 2:34 AM | Updated on Oct 6 2025 2:34 AM

అభ్యర్థుల గెలుపే లక్ష్యం

అభ్యర్థుల గెలుపే లక్ష్యం

● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

కోనరావుపేట(వేములవాడ): స్థానికసంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ కోరారు. కోనరావుపేటలోని ఆర్యవైశ్య కమ్యూనిటీహాల్‌లో ఆది వారం నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. కార్యకర్తలే కాంగ్రెస్‌ పార్టీకి బలమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి నిధులు ఖర్చు చేస్తోందన్నారు. ప్రతీ కార్యకర్త ఒక సైనికుడుగా పనిచేసి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. ప్రతిపక్షాలు చేస్తున్న రాద్దాంతం, వారి దిగజారుడు మాటలు పట్టించుకోకుండా ముందుకుపోవాలన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి న్యాయం చేస్తామన్నారు.

కాంగ్రెస్‌ పార్టీలో చేరిక

మామిడిపల్లి మాజీ సర్పంచ్‌ కొక్కుల నర్సయ్య–భారత, విశ్వబ్రాహ్మణ సంఘం మండలాధ్యక్షుడు సంకోజి సత్తయ్య, శివంగాలపల్లి మాజీ సర్పంచ్‌ శివంగాల సురేశ్‌తోపాటు సుమారు 50 మంది నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కిసాన్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ కచ్చకాయల ఎల్లయ్య, వైస్‌చైర్మన్‌ ప్రభాకర్‌, సింగిల్‌విండో చైర్మన్‌ బండ నర్సయ్య, మండలాధ్యక్షుడు ఫిరోజ్‌ పాషా, మాజీ జెడ్పీటీసీ గొట్టె రుక్మిణి, యూత్‌ అధ్యక్షుడు బండి ప్రభాకర్‌ పాల్గొన్నారు.

రుద్రంగి(వేములవాడ): రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రుద్రంగి గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగరాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. రుద్రంగిలోని శుభం గార్డెన్స్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement