
సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుదాం
● టీడీఎఫ్ అమెరికా అధ్యక్షుడు శ్రీనివాస్ ● అమెరికాలో బతుకమ్మ సంబరాలు
ముస్తాబాద్(సిరిసిల్ల): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ భవిష్యత్ తరా లకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం అమెరికా అధ్యక్షుడు శ్రీనివాస్ మణికొండ అన్నారు. టీడీఎఫ్ అమెరికా శాఖ ఆధ్వర్యంలో కాలిఫోర్నియాలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. మహిళలు తెలంగాణ సంప్రదాయ వస్త్రాలు ధరించి, తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి ఆడిపాడారు. అమెరికా టీడీఎఫ్ అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఇరవై ఐదేళ్లుగా టీడీఎఫ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. టీడీఎఫ్ ఇండియా అధ్యక్షుడు మట్ట రాజేశ్వర్‌రెడ్డి, రాజారెడ్డి, నిర్వాహకులు కీర్తి, సరిత, భార్గవి, శ్వేత, దివ్య, పల్లవి, స్రవంతి, అర్పిత తదితరులు పాల్గొన్నారు.