
దుకాణాలు నిరుపయోగం
ఇది జిల్లా కేంద్రంలోని శివనగర్ పార్క్ వద్ద నిర్మించిన ఎకో ఫ్రెండ్లీ దుకాణాలు. నిర్మించినప్పటి నుంచి దుకాణాలన్నీ నిరుపయోగంగానే ఉన్నాయి. ఇలా సిరిసిల్లలో రూ.1.93 కోట్లతో మొత్తం 60 షాపులు ఎకో ఫ్రెండ్లీ దుకాణాల సముదా యాలను నాలుగు ప్రదేశాల్లో నిర్మించగా.. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్ద, రైతు బజా రు వద్ద షాపులు వినియోగంలో ఉండగా.. మిగతావి వృథాగా పడి ఉన్నాయి.
ఇది తారకరామానగర్‌లోని ఎకోఫ్రెండ్లీ షాప్. కానీ షాపు రేకులను, ఇరువైపులా ఉన్న అడ్డుగోడల కోసం నిర్మించిన అట్టలను ఆకతాయిలు తొలగించడంతో అసాంఘిక కార్యక్రమాలకు స్థావరాలుగా మారాయి. మందుబాబులకు అడ్డాలుగా మారాయి. రాత్రి వేళల్లో ఆ షాపుల ముందు నుంచి వెళ్లేందుకు స్థానికులు భయపడుతున్నారు. అక్కడ నిర్మించిన టాయిటెట్లు, నేలపై పరిచిన టైల్స్ ఊడిపోయాయి.
ఇది సిరిసిల్లలోని తారకరామానగర్ ప్రాంతం. ఇక్కడ వీధి వ్యాపారుల కోసం మున్సిపల్ అధికారులు 16 షాపులను ఏర్పాటు చేశారు. పేద వీధి వ్యాపారులు ఇక్కడి షాపుల్లో ఏదైనా వ్యాపారం చేసుకుంటూ.. ఉపాధి పొందాలని రూ.93లక్షలతో వీటిని నిర్మించారు. పర్యావరణ హితమైన ఎకో ఫ్రెండ్లీ రేకులు, సామాగ్రితో 2019లో నిర్మించారు. అప్పటి నుంచి నిరుపయోగంగానే ఉన్నాయి.

దుకాణాలు నిరుపయోగం

దుకాణాలు నిరుపయోగం

దుకాణాలు నిరుపయోగం