
భక్తిశ్రద్ధలతో దుర్గామాత శోభాయాత్ర
ఎల్లారెడ్డిపేట/ముస్తాబాద్(సిరిసిల్ల): నవరాత్రులు విశేష పూజలందుకున్న దుర్గామాత విగ్రహాలను భక్తులు శనివారం నిమజ్జనానికి తరలించారు. మండలకేంద్రంలోని దుర్గా భవాని సేవా సమితి సభ్యులు అమ్మవారిని విజయవాడ కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. నారాయణపూర్‌లోని శ్రీనవదుర్గా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమ్మవారి చీరలకు లక్కీ డ్రా తీయగా 200 మంది పాల్గొనగా, 11 మంది చీరలను దక్కించుకున్నారు. ముస్తాబాద్‌లో మార్కండేయ భవన్, రాక్‌స్టార్ యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత శోభా యాత్ర నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పెద్ద చెరువులో నిమజ్జనం చేశారు.
నారాయణపూర్‌లో దుర్గామాత శోభాయాత్ర
ముస్తాబాద్‌లో దుర్గామాత శోభాయాత్రలో మహిళలు

భక్తిశ్రద్ధలతో దుర్గామాత శోభాయాత్ర