
సూర్యప్రభ, చంద్రప్రభలపై శ్రీవారి విహారం
సిరిసిల్లటౌన్: బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీవారు సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలపై ఊరేగారు. ఉదయం సూర్యప్రభ, రాత్రి శ్రీదేవీ, భూదేవీ సహితంగా వేంకటేశ్వరస్వామి చంద్రప్రభ వాహనాలపై పురవీధుల్లో విహరించారు. గోవింద నామస్మరణతో మాఢవీధులు మారుమోగాయి. సాయంత్రం 6 గంటలకు రంగనాయక తిరుప్పోలంపై విహరించారు. రంగనాయక తిరప్పోలం సేవ ఆకట్టుకుంది. ఆలయ ఈవో మారుతిరావు, ఏఈవోలు పీసరి రవీందర్, కూనబోయిన సత్యం, టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, ఆలయ మాజీ చైర్మన్లు ఉప్పుల విఠల్‌రెడ్డి, చేపూరి నాగరాజు, తీగల శేఖర్‌గౌడ్, అర్చకస్వామి కృష్ణమాచారి పాల్గొన్నారు.