
రాజన్న ఆలయం మూసివేయొద్దు
వేములవాడ: ఆలయ విస్తరణ, అభివృద్ధి పేరుతో రాజన్న గుడిని మూసివేసి భక్తులను ఇబ్బందులకు గురి చేయొద్దని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు. వేములవాడలో శనివారం విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి పనులకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అభివృద్ధి పేరుతో రాజన్న గుడిని మూసివేసి భక్తులకు భీమన్న ఆలయంలో అనుమతినిస్తామని ప్రకటించడం సరైంది కాదన్నారు. గుడి పరిసరాల్లో ఎంతో మంది భక్తులను నమ్ముకుని చిరువ్యాపారులు ఉన్నారని, గుడిని మూసివేస్తే వారంతా ఉపాధి కోల్పోతారన్నారు. మాజీ ఎంపీపీ బండ మల్లేశం పాల్గొన్నారు.