
పని గంటలు కుదించాలి
సిరిసిల్లలో 8 గంటల పనివిధానం కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. సాంచాల మధ్య 10 నుంచి 12 గంటలు రెస్ట్ లేకుండా శ్రమించడం ఇబ్బందిగా ఉంది. రాత్రి పూట సాంచాలు బంద్ ఉండడం మంచి పరిణామం. కొందరు యజమానులు రాత్రి షిఫ్టుల్లోనూ పనిచేయిస్తున్నారు. కానీ పని గంటలను కుదిస్తే కార్మికులకు విశ్రాంతి దొరుకుతుంది. ఆరోగ్య సమస్యలు చాలా వరకు దూరమవుతాయి. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. – మూశం రమేశ్, కార్మిక నాయకుడు
నిద్ర లేమితో అనేక రుగ్మతలు
నిద్ర లేమి అనేక ఆరోగ్య సమస్యలకు, మానసిక రుగ్మతలకు కారణమవుతుంది. రాత్రిపూట బాగా నిద్రపోతే అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. సరైన నిద్ర లేకుంటే మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కోపం, చికాకు వంటి సమస్యలు ఎదురవుతాయి. షుగర్, బీపీ కంట్రోల్ తప్పుతుంది. కండరాల నొప్పులు వస్తాయి. ఎవరైనా సరే మంచి నిద్రపోవాలి. రాత్రి పూట నిద్రపోతే ఆరోగ్యం చాలా బాగుంటుంది.
– డాక్టర్ ప్రవీణ్, మానసిక వైద్యనిపుణులు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి

పని గంటలు కుదించాలి