
ఘనంగా దసరా
రాంలీలా మైదానంలో రావణ సంహారం
మానేరు తీరంలో అలరించిన శమీ దర్శనం
సిరిసిల్లటౌన్/వేములవాడ: జిల్లాలో దసరా వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. సిరిసిల్ల మానేరు వాగు తీరంలోని రాంలీల మైదానంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రావణ సంహారం నిర్వహించారు. ఎస్పీ మహేశ్ బీ గీతే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ససర్‌దేశాయ్ చెన్నమనేని శ్రీనివాస్‌రావుదేశాయ్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు చేపూరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మేర్గు సత్యం, గౌరవ అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, గాజుల వేణు, చేపూరి అశోక్, తదితరులు పాల్గొన్నారు. శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి భక్తజనులకు శమీ దర్శనం కల్పించారు. గురువారం సాయంత్రం అశ్వవాహనంపై బయలుదేరిన స్వామి వారు మానేరుతీరంలోని జమ్మిచెట్టు వద్దకు చేరుకోగా శమీపూజ జరిగింది. టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, ఆలయ మాజీ చైర్మన్లు ఉప్పుల విఠల్‌రెడ్డి, చేపూరి నాగరాజు, తీగల శేఖర్‌గౌడ్, ఈవో మారుతిరావు, ఏఈవోలు పీసరి రవీందర్, కూనబోయిన సత్యం పాల్గొన్నారు.
వేములవాడలో వైభవంగా ‘శమీయాత్ర’
శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మహాలక్ష్మి ఆలయం వద్దనున్న జంబిచెట్టుకు పూజలు చేశారు. రాత్రి 9 గంటలకు జరిగే నిషిపూజ, ఏకాంతసేవ పూజలతో ఉత్సవాలు ముగిసినట్లు ఇన్‌చార్జి స్థానాచార్యులు ఉమేశ్‌శర్మ తెలిపారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఈవో రమాదేవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. దసరాను పురస్కరించుకుని ఆలయంలో ఈవో రమాదేవి ఆయుధపూజ నిర్వహించారు.

ఘనంగా దసరా