మహాలక్ష్మీ నమోస్తుతి | - | Sakshi
Sakshi News home page

మహాలక్ష్మీ నమోస్తుతి

Oct 4 2025 8:04 AM | Updated on Oct 4 2025 8:04 AM

మహాలక

మహాలక్ష్మీ నమోస్తుతి

బార్‌, బెంచ్‌ బాధ్యతగా మెలగాలి ● జూనియర్‌ సివిల్‌ జడ్జి ప్రవీణ్‌కుమార్‌ రోడ్డు బాగు చేసుకున్న గిరిజనులు మున్సిపల్‌ ముందు నిరసన ఎల్‌ఎండీకి నీటి విడుదల

వేములవాడ: దేవీ నవరాత్రోత్సవాల్లో భాగంగా చివరిరోజు గురువారం అమ్మవారు మహాలక్ష్మి (పాలవెల్లి) అలంకారంలో దర్శనమిచ్చారు. నాగిరెడ్డి మండపంలోని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అందమైన వేదికపైన మహాలక్ష్మి అవతారంలో ఉన్న అమ్మవారిని, బాలత్రిపుర సుందరాదేవి, శ్రీరాజరాజేశ్వరీ అమ్మవారిని మహాలక్ష్మి అలంకారాలతో అర్చకులు అలంకరించారు.

వేములవాడ: బార్‌ అండ్‌ బెంచ్‌ బాధ్యతాయుతంగా మెదలుకోవాలని జూనియర్‌ సివిల్‌ జడ్జి ప్రవీణ్‌కుమార్‌ సూచించారు. వేములవాడ బార్‌ అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన గుడిసె సదానందం, సబ్‌కోర్టు ఏపీపీగా బాధ్యతలు చేపట్టిన అవధూత రజనీకాంత్‌లు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు కటకం జనార్దన్‌, అడ్వకేట్లు నాగుల సత్యనారాయణ, రేగుల దేవేందర్‌, పొత్తూరు అనిల్‌కుమార్‌, వేముల సుధాకర్‌రెడ్డి, పెంట రాజు, పర్లపెల్లి అంజయ్య, నాగుల సంపత్‌, హరికృష్ణ, సంపత్‌, అన్నపూర్ణ, మనోహర్‌ తదితరులున్నారు.

వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని వన్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని శంకర్‌నాయక్‌తండా, రెడ్డినాయక్‌తండాలకు వెళ్లే రోడ్డును గ్రామస్తులు బాగుచేసుకున్నారు. దసరా పండ గ పూట రెండు తండాల గిరిజనులు సొంత ఖ ర్చులతో తాత్కాలిక రోడ్డును బాగుచేసుకున్నా రు. గిరిజనులు మాట్లాడుతూ రెండు తండాల కు రోడ్డు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదన్నారు.

సిరిసిల్లటౌన్‌: సులభ్‌ కాంప్లెక్స్‌లో సమస్యలు పరిష్కరించాలని సిరిసిల్ల పౌరసంక్షేమ సమితి అధ్యక్షుడు బియ్యంకార్‌ శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఈమేరకు శుక్రవారం మున్సిపల్‌ ఆఫీస్‌ ఎదుట నిరసన చేపట్టి మాట్లాడారు. మున్సిపల్‌ ద్వారా నిర్వహిస్తున్న లేబర్‌ అడ్డా దగ్గర సులభ్‌ కాంప్లెక్స్‌లో ఉచిత మూత్రశాల అని బోర్డులు ఉన్నా కూడా డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. ఉచితం బోర్డులు కనిపించకుండా కాగితాన్ని అంటించారన్నారు. సమితి ఉపాధ్యక్షులు చీకోటి అనిల్‌కుమార్‌, కోశాధికారి చిప్ప దేవదాస్‌, సభ్యులు వేముల పోశెట్టి పాల్గొన్నారు.

బోయినపల్లి(చొప్పదండి): శ్రీరాజరాజేశ్వర(మిడ్‌మానేరు) ప్రాజెక్టు నుంచి ఎల్‌ఎండీకి 850 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ప్రాజెక్టులోకి వేయి క్యూసెక్కుల మేర వరద ఇన్‌ ఫ్లోగా చేరుతోంది. మిడ్‌మానేరు ప్రాజెక్టులో నీటిమట్టం 27.479 టీఎంసీలకు చేరింది.

మహాలక్ష్మీ నమోస్తుతి1
1/4

మహాలక్ష్మీ నమోస్తుతి

మహాలక్ష్మీ నమోస్తుతి2
2/4

మహాలక్ష్మీ నమోస్తుతి

మహాలక్ష్మీ నమోస్తుతి3
3/4

మహాలక్ష్మీ నమోస్తుతి

మహాలక్ష్మీ నమోస్తుతి4
4/4

మహాలక్ష్మీ నమోస్తుతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement