
బ్రహ్మోత్సవం.. పులకించిన భక్తజనం
సిరిసిల్లటౌన్: ఐదు రోజులుగా కొనసాగుతున్న సిరిసిల్ల శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలతో కార్మికక్షేత్రం పులకించింది. వేడుకల్లో నాలుగు, ఐదు రోజుల్లో జరిగిన అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాల్లో భక్తులు దేవదేవునికి నీరాజనం పలికారు. గురు, శుక్రవారాల్లో శ్రీవారి వాహనసేవలు కనుల పండువగా సాగాయి. గురువారం విజయదశమిని పురస్కరించుకొని ఆలయంలో ఉదయం 8 గంటలకు హోమం, 10 గంటలకు సింహవాహనం, సాయంత్రం 5 గంటలకు అశ్వవాహనంపై శ్రీవారు విహరించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు గరుడసేవ, రాత్రి 9 గంటలకు హనుమంత వాహనాలపై శ్రీదేవి, భూదేవి సహితంగా శ్రీవారిని మాడవీధుల్లో ఊరేగించారు. టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, ఆలయ మాజీ చైర్మన్లు ఉప్పుల విఠల్‌రెడ్డి, తీగల శేఖర్‌గౌడ్, చేపూరి నాగరాజు, ఈవో మారుతిరావు, ఏఈవోలు పీసరి రవీందర్, ప్రధాన అర్చకులు కృష్ణమాచారి, వర్ధనాచారి పాల్గొన్నారు.
నేత్రపర్వం శ్రీనివాస కల్యాణం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీవారి కల్యాణోత్సవం జరిగింది. వేదపండితులు శ్రీలక్ష్మి, పద్మావతీవేంకటేశ్వరస్వామిల వివాహ వేడుకలను నిర్వహించారు. ఆలయ ఈవో మారుతిరావు, ఏఈవోలు పీసరి రవీందర్, కూనబోయిన సత్యం, అర్చకస్వాములు కృష్ణమాచారి, వర్ధనాచారి, సుకుమారాచారి, మాజీ చైర్మన్లు ఉప్పుల విఠల్‌రెడ్డి, మాజీ చైర్మన్లు తీగల శేఖర్‌గౌడ్, చేపూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి వారు
కళ్యాణ ం నిర్వహిస్తున్న అర్చకులు

బ్రహ్మోత్సవం.. పులకించిన భక్తజనం

బ్రహ్మోత్సవం.. పులకించిన భక్తజనం