
రూ.5.04కోట్లు తాగేశారు
● 232 బైకులు, 50 కార్ల విక్రయాలు ● పండుగ పూట జోరుగా వ్యాపారాలు
సిరిసిల్లక్రైం: దసరా పండుగకు జిల్లాలో మద్యం, వాహనాల విక్రయాలు పెరిగాయి. ఈ ఏడాది దసరా, గాంధీ జయంతి ఒకే రోజున రావడంతో ప్రభుత్వ నిర్ణయంతో అక్టోబర్ 2న వైన్‌షాపులు మూసివేశారు. అయితే ముందు రోజే మద్యం కొనుగోలు చేసుకుని నిల్వ చేసుకున్నారు. ఈ దసరా సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా రూ.5.04 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారుల అంచనా. వాహనాల కొనుగోళ్లు కూడా భారీగా జరిగాయి. కేంద్ర ప్రభుత్వం వాహనాలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం వినియోగదారులకు ఊరటనిచ్చింది. దీంతో పండుగ ఆఫర్లు, జీఎస్టీ తగ్గింపుతో కలిపి వాహన మార్కెట్ జోరందుకుంది. జిల్లాలో 232 ద్విచక్ర వాహనాలు, 50 కార్లు కొత్తగా కొనుగోలు చేశారు. రానున్న దీపావళి వరకు ఈ కొనుగోళ్ల ఊపు కొనసాగుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.