మానేరు తీరాన శమీ పూజోత్సవం | - | Sakshi
Sakshi News home page

మానేరు తీరాన శమీ పూజోత్సవం

Oct 2 2025 7:52 AM | Updated on Oct 2 2025 7:52 AM

మానేర

మానేరు తీరాన శమీ పూజోత్సవం

సిరిసిల్లటౌన్‌: జిల్లా కేంద్రం దసరా ఉత్సవాలకు పేరెన్నికై ంది. 800 ఏళ్ల క్రితమే శ్రీశాల(సిరిసిల్ల) క్షేత్రంలో కేశవనాథుని ఆలయం నిర్మితమైందని పురాణాలు చెబుతున్నాయి. కాకతీయుల కాలంలో మొగలాయిలు హిందూ ఆలయాలపై దాడి చేసిన సంఘటనకు సాక్ష్యంగా ధ్వంసమైన ఇక్కడి మూలవిరాట్టు విగ్రహం వాహనశాలలో భద్రంగా ఉంది. ఈ ఘటనపై ప్రజలు మనోవేదనకు గురవుతుండగా సిరిసిల్లను పాలిస్తున్న సర్‌దేశాయ్‌ చెన్నమనేని వంశస్తులు తుక్కారావు, మీనారావులకు స్వప్నంలో స్వామి వారు కనిపించి మాండవ్య మహానది(మానేరు) ప్రాంతంలో బర్రెంకల చెట్టుకింద భూమిలో ఉన్న విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలని చెప్పి అంతర్ధానమయ్యారు. దేశాయ్‌లు ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి వాహనాలు, పొన్నసేవ, రథాన్ని చేయించారు. అప్పటి నుంచి సిరిసిల్లలో బహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అప్పటి నుంచి ఏటా దసరా రోజున మానేరు తీరాన గల జమ్మిగద్దెకు అశ్వవాహనంపై శ్రీవారు వచ్చినాకే శమీపూజలు నిర్వహిస్తారు. శమీవృక్షాన్ని తీసుకొచ్చి గద్దైపె ఏర్పాటు చేసే హక్కును ముదిరాజ్‌ కులస్తులకే ఉంది. శమీపూజ సమయంలో పాలపిట్టను దర్శించుకోవడం ఇక్కడి ప్రత్యేకత.

ఆకట్టుకునే రావణ సంహారం

మానేరుతీరాన గల రాంలీల మైదానంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రావణ సంహారం నిర్వహిస్తా రు. మానేరువాగు ఒ డ్డున ఏర్పాటు 20 అడుగుల ఎత్తులో పదితలల రావణాసురుడి ప్రతి మను దహనం చేసి చె డుపై సాధించిన విజయమే దసరాగా ఉత్సవాలు నిర్వహిస్తారు. చెన్నమనేని వంశస్తులు, ఇతర ముఖ్య అతిథుల చేతుల మీదుగా రావణవధ నిర్వహించడం ఇక్కడ దశాబ్దాలుగా కొనసాగుతోంది.

మానేరు తీరాన శమీ పూజోత్సవం1
1/1

మానేరు తీరాన శమీ పూజోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement