
పాడిపంటలు బాగుండాలి
వేములవాడ: పాడిపంటలు బాగుండాలని, వ ర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు సుఖ సంతో షాలతో ఉండాలని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆకాంక్షించారు. బుధవారం పట్టణంలోని ప్రధాన వీధులు, జంబిచెట్టు గద్దె, ప్రధాన కూడళ్ల నుంచి ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు.
వైన్స్ షాపులు కిటకిట
సిరిసిల్లక్రైం: అక్టోబర్ 2న దసర పండుగ వస్తుండడం.. అదే రోజు గాంధీ జయంతి కావడంతో మాంసం విక్రయిస్తారా.. లేదా.. అనే సందేహాలు నెలకొన్నాయి. దీంతో చాలా మంది ముందస్తుగానే యాట పిల్లలను కొనుక్కొచ్చారు. అంతేకాకుండా బుధవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా అన్ని వైన్ షాపుల వద్ద జనం రద్దీ పెరిగింది. గురువారం మద్యం విక్రయాలు ఉండవని ముందస్తుగానే పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లు కొనుక్కెళ్లారు. ఒక్క రోజు ముందే వ్యాపారులకు దసరా కిక్కెక్కింది.

పాడిపంటలు బాగుండాలి