
లండన్‌లో ఉంటున్నా దసరా సొంతూరిలోనే..
ఇల్లంతకుంట(మానకొండూర్): ఉపాధి కోసం విదేశాలకు వెళ్లినా పుట్టిన ఊరుపై మమకారం, స్నేహితులను కలవాలన్న తపనతో లండన్‌లో ఉంటున్నా ఏటా బతుకమ్మ, దసరా పండుగలకు స్వగ్రామానికి వస్తామంటున్నారు ఇల్లంతకుంటకు చెందిన అంతగిరి అశోక్‌కుమార్. మండల కేంద్రానికి చెందిన అంతగిరి అశోక్‌కుమార్ ఎమ్మెసీ, బీటెక్ పూర్తి చేసి పదిహేనేళ్ల క్రితం లండన్ వెళ్లి స్థిరపడ్డారు. లండన్‌లోని ప్రభుత్వ కార్యాలయంలో సాఫ్ట్‌వేర్‌గా విధులు నిర్వహిస్తూ స్వతంత్రంగా ఐటి కంపెనీ, రెస్టారెంట్ ఏర్పాటు చేసుకొని ఇతరులకు ఉపాధి కల్పిస్తున్నారు. అశోక్‌కుమార్ మాట్లాడుతూ సొంతూరిపై మమకారంతో దసరా, బతుకమ్మ పండుగలకు వస్తామని, బంధువులు, కుటుంబ సభ్యులను కలుసుకోవడం ఎంతో సంతోషాన్నిస్తుందని తెలిపారు. భార్య అర్చన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, ఇద్దరు కూతుళ్లు నక్షత్ర, జిష్ణుసాయి సాన్వి.