
హైదరాబాద్ టీ–20 జట్టుకు శ్రీవల్లి
కరీంనగర్‌స్పోర్ట్స్/ఇల్లంతకుంట(మానకొండూర్): హైదరాబాద్ మహిళల టీ–20 క్రికెట్ జట్టులో కరీంనగర్‌కు చెందిన క్రీడాకారిణి కట్ట శ్రీవల్లి చోటు సంపాదించింది. హైదరాబాద్ సీనియర్ మహిళల టీ–20 క్రికెట్ జట్టును క్రికెట్ సంఘం బాధ్యులు బుధవారం ప్రకటించారు. అక్టోబర్ 8 నుంచి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో బీసీసీఐ టీ20 టోర్నీ ప్రారంభంకానుంది. టోర్నమెంట్‌లో భాగంగా పాల్గొనే హైదరాబాద్ సీనియర్ మహిళల జట్టులో శ్రీవల్లి చోటు దక్కించుకుంది. శ్రీవల్లి ఎంపికపై కరీంనగర్ జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు ఆగం రావుతోపాటు తల్లిదండ్రులు కట్ట ఉమా–లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. శ్రీవల్లి స్వస్థలం రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామం.