
అందరికి విజయాలు చేకూర్చాలి
● ఎస్పీ మహేశ్ బీ గీతే ● డీపీవోలో ఆయుధ, వాహన పూజ
సిరిసిల్లక్రైం: విజయదశమి పండుగ ప్రజలకు విజయం చేకూర్చాలని ఎస్పీ మహేశ్ బీ గీతే ఆకాంక్షించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆర్మ్‌డు రిజర్వ్ విభాగంలో బుధవారం ఆయుధ, వాహనపూజ నిర్వహించారు. దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్‌ఐలు మధుకర్, యాదగిరి, సీఐలు కృష్ణ, నాగేశ్వరావు, మధుకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.