
హంస వాహనంపై స్వామి
సిరిసిల్లటౌన్: శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడు రోజులుగా సాగుతున్న బ్రహ్మోత్సవాల్లో బుధవారం మూలమంత్ర, మహామంత్ర హోమాలు, నిత్యపూర్ణాహుతి, నిత్యారాధన నిర్వహించారు. రాత్రి 9 గంటలకు హంస వాహనంపై శ్రీదేవి, భూదేవి సహిత శ్రీనివాసుడుని తిరువీధుల్లో ఊరేగించారు. గోవింద నామస్మరణతో మాఢవీదులు మారుమోగాయి. ఆలయ ఈవో మారుతిరావు, ఏఈవో పీసరి రవీందర్, కూనబోయిన సత్యం, అర్చకస్వాములు కృష్ణ్ణమాచారి, వర్ధనాచారి, టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, ఆలయ మాజీ చైర్మన్లు ఉప్పుల విఠల్‌రెడ్డి, మాజీచైర్మన్లు తీగల శేఖర్‌గౌడ్, చేపూరి నాగరాజు పాల్గొన్నారు.