
చిమ్మచీకటి.. బురద
చందుర్తి(వేములవాడ): చందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో అంధకారం నెలకొంది. బురదతో రోడ్డు అధ్వానంగా మారింది. వీధి దీపాలు లేక ఇరవై రోజులు గుడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. ఐదు మాసాల క్రితం కాలనీలో సీసీ రోడ్డు వేస్తామని, రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించి గుంతలను చదును చేసి సిద్ధం చేయగా, గడువు దాటిపోయిందని, పనులను నిలిపి వేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఆ పనులు చేయకుండానే నిలిచి పోయాయి. దీంతో చిన్నపాటి వర్షం పడినా రోడ్డంతా బురదమయంగా మారుతోందని, దీనికి తోడు వీధి దీపాలు లేక తిప్పలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఎస్సీ కాలనీలో సమస్యలు తీర్చాలని కోరారు.