పల్లెల్లో ‘ప్రాదేశిక’ పోరు | - | Sakshi
Sakshi News home page

పల్లెల్లో ‘ప్రాదేశిక’ పోరు

Sep 29 2025 11:08 AM | Updated on Sep 29 2025 11:08 AM

పల్లె

పల్లెల్లో ‘ప్రాదేశిక’ పోరు

● బోయినపల్లి మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 5 బీసీలకు, 3 జనరల్‌కు, 3 ఎస్సీలకు కేటాయించారు. ● కోనరావుపేట మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలకు బీసీలకు 5, ఎస్సీలకు 3, ఎస్టీలకు ఒక్కటి, జనరల్‌కు 3 స్థానాలు కేటాయించారు. ● తంగళ్లపల్లి మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలకు బీసీలకు 6, ఎస్సీలకు 3, జనరల్‌కు 5 కేటాయించారు. ● ఎల్లారెడ్డిపేట మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలు ఉండగా బీసీలకు 6, ఎస్సీలకు 3, ఎస్టీలకు ఒక్కటి, జనరల్‌ 3 కేటాయించారు. ● గంభీరావుపేట మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ఎస్సీలకు 3, బీసీ 6, జనరల్‌ 3, ఎస్టీకి ఒక్క స్థానం కేటాయించారు. ● ముస్తాబాద్‌ మండంలంలో 13 ఎంపీటీసీ స్థానాలకు బీసీలకు 7, ఎస్సీలకు 2, జనరల్‌కు 4 స్థానాలు కేటాయించారు. ● వీర్నపల్లి మండలంలో 5 ఎంపీటీసీ స్థానాలు ఉండగా బీసీలకు 2, ఎస్టీలకు 2, జనరల్‌కు ఒక్క స్థానాన్ని కేటాయించారు. ● రుద్రంగి మండలంలో 5 ఎంపీటీసీ స్థానాలు ఉండగా బీసీ 2, జనరల్‌ 2, ఎస్టీలకు ఒక్క స్థానం కేటాయించారు. ● వేములవాడరూరల్‌ మండలంలో 7 ఎంపీటీసీ స్థానాలుండగా.. బీసీలకు 3, ఎస్సీలకు 2, ఎస్టీలకు ఒక్కటి, జనరల్‌ 2 స్థానాలు కేటాయించారు. ● వేములవాడ అర్బన్‌ మండలంలో 4 స్థానాలు ఉన్నాయి. ఇందులో బీసీలకు 2, జనరల్‌కు ఒక్కటీ, ఎస్సీలకు ఒక్కటి కేటాయించారు. ● చందుర్తి మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. బీసీలకు 6, ఎస్సీలకు 2, జనరల్‌ 4 స్థానాలు కేటాయించారు. ● ఇల్లంతకుంట మండలం 14 ఎంపీటీసీ స్థానాలకు బీసీలకు 6, ఎస్సీలకు 3, జనరల్‌కు 5 స్థానాలు కేటాయించారు.

‘స్థానిక’ రిజర్వేషన్లు ఖరారు జెడ్పీ చైర్మన్‌ స్థానం ఎస్సీలకు 123 ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లు ఖరారు గెజిట్‌ జారీకి నివేదిక

సిరిసిల్ల: పల్లెల్లో ప్రాదేశిక పోరుకు రంగం సిద్ధమైంది. జిల్లా ప్రజాపరిషత్‌, మండల ప్రజాపరిషత్‌ల పాలకవర్గాల పదవీకాలం 15 నెలల కిందటే ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాల న కొనసాగుతుండగా.. 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందనే ఊహగానాల మధ్య స్థానిక సంస్థల రిజర్వేషన్లను జిల్లా అధికారులు ఖరారు చేసి రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు నివేదించారు. అధికారికంగా రిజర్వేషన్లపై గెజిట్‌ జారీ కావాల్సి ఉంది. రాష్ట్ర స్థాయిలో జెడ్పీ చైర్మన్‌ స్థానాలకు రిజర్వేషన్లు కల్పించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ స్థానాన్ని ఎస్సీలకు కేటాయించారు. జిల్లాలో 12 జెడ్పీటీసీ స్థానాలు, మరో 12 ఎంపీపీ స్థానాలు, 123 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. వీటి రిజర్వేషన్లు ఖరారు చేశారు.

ఆ మూడు మండలాలకే

జెడ్పీ చైర్‌పర్సన్‌ అవకాశం

జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ స్థానాన్ని ఎస్సీలకు కేటాయించడంతో జెడ్పీటీసీ సభ్యులుగా ఎన్నికై న ఎస్సీ అభ్యర్థులకు ఆ పీఠం దక్కే అవకాశం ఉంది. ఇల్లంతకుంట, కోనరావుపేట, వేములవాడరూరల్‌ మండలాల్లో ఎస్సీ అభ్యర్థులు జెడ్పీటీసీలుగా ఎన్ని కయ్యే అవకాశం ఉంది. దీంతో ఆ మూడు మండలాల్లో ఎన్నికై న ఎస్సీ అభ్యర్థులే జెడ్పీ చైర్‌పర్సన్లు కానున్నారు. మరోవైపు జనరల్‌ స్థానాల్లోనూ ఎస్సీ అభ్యర్థులు ఎవరైనా ఎన్నికై తే వారికి అవకాశం లభించనుంది. జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ ఎమ్మెల్యే స్థానాలు పూర్తిగా ఉండగా.. మానకొండూ రు, చొప్పదండి నియోజకవర్గాలు పాక్షికంగా ఉన్నా యి. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జెడ్పీటీసీ సభ్యులను, ఎంపీపీ అభ్యర్థులను నిర్ణయించే అ వకాశం ఉంది. ఎన్నికల్లో అయా పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత కూడా వారిపైనే ఉంటుంది.

ఎంపీటీసీ సభ్యుల స్థానాలపై ఉత్కంఠ

జిల్లాలో 123 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ఆయా స్థానాల రిజర్వేషన్లను జిల్లా పరిషత్‌ అధికారులు ఖరారు చేశారు. ఈమేరకు రిజర్వేషన్ల నివేదికను పంచాయతీరాజ్‌ ఉన్నతాధికారులకు నివేదించారు.

ఎంపీపీ స్థానాలపై ఎంపీటీసీ సభ్యుల గురి

స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికై .. రిజర్వేషన్‌ అనుకూలిస్తే.. ఎంపీపీ పీఠాన్ని దక్కించుకోవాలని పలువురు నాయకులు గురిపెట్టారు. ఎంపీపీ రిజర్వేషన్‌ స్థానాలను అనుసరించి, ఆయా స్థానాల్లో ఎంపీటీసీ సభ్యులుగా పోటీచేయాలని భావిస్తున్నారు. జనరల్‌ స్థానాల్లో పోటీ ఎక్కువగా ఉండగా.. మండల స్థాయిలో చక్రం తిప్పే ఎంపీపీ స్థానాలపై పలువురు గురిపెట్టారు.

జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్లు

మండలం జెడ్పీటీసీ ఎంపీపీ

బోయినపల్లి బీసీ జనరల్‌ బీసీ మహిళ

కోనరావుపేట ఎస్సీ జనరల్‌ ఎస్సీ జనరల్‌

తంగళ్లపల్లి బీసీ జనరల్‌ జనరల్‌

ఎల్లారెడ్డిపేట జనరల్‌ మహిళ బీసీ జనరల్‌

గంభీరావుపేట బీసీ జనరల్‌ బీసీ జనరల్‌

ముస్తాబాద్‌ బీసీ మహిళ ఎస్సీ మహిళ

వీర్నపల్లి జనరల్‌ జనరల్‌ మహిళ

రుద్రంగి ఎస్టీ జనరల్‌ ఎస్టీ జనరల్‌

వేములవాడరూరల్‌ ఎస్సీ జనరల్‌ ఎస్సీ జనరల్‌

వేములవాడఅర్బన్‌ బీసీ మహిళ బీసీ జనరల్‌

చందుర్తి జనరల్‌ జనరల్‌

ఇల్లంతకుంట ఎస్సీ మహిళ బీసీ మహిళ

పల్లెల్లో ‘ప్రాదేశిక’ పోరు1
1/1

పల్లెల్లో ‘ప్రాదేశిక’ పోరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement