
కాత్యాయినీ నమోస్తుతి
వేములవాడ: రాజన్న ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారు కాత్యాయినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వడ్డేపెల్లి సాహిత్య పురస్కారం అందుకున్న కిరణ్
సిరిసిల్లకల్చరల్: ప్రముఖ లలితగీతాల కవి వడ్డేపెల్లి కృష్ణ స్మారకార్థం అఖిల భారత పద్మశాలి సంక్షేమ సంఘం జాతీయ సాహిత్య పురస్కారం జిల్లా కేంద్రానికి చెందిన వ్యాసకర్త చిటికెన కిరణ్‌కుమార్ అందుకున్నారు. హైదరాబాద్‌లోని కేంద్ర గ్రంథాలయ భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పురస్కారాన్ని ప్రదానం చేశారు. గ్రంథాలయం అధ్యక్షుడు రియాజ్ అలీ, పద్మశాలి అన్నసత్రాల మార్గదర్శకులు చిలువేరి కాశీనాథ్, సంక్షేమ సంఘం అధ్యక్షుడు తుమ్మ సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు బైరి శ్రీనివాస్, సూరేపల్లి రవికుమార్, పాలడుగు సరోజనీదేవి, కవయిత్రి డాక్టర్ రాధాకుసుమ, తుమ్మ జనార్దన్, సత్యవీణ పాల్గొన్నారు.
రాజన్న అన్నదాన ట్రస్టుకు విరాళం
వేములవాడ: రాజన్న అన్నదాన ట్రస్టుకు హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌కు చెందిన కొమురవెల్లి అశోక్–అనిత దంపతులు రూ.86వేలు విరాళంగా అందించారు. ఆలయ పర్యవేక్షకులు గౌరిబట్ల శ్రీనివాస్‌శర్మకు చెక్కును ఆదివారం అందజేశారు.
ఎల్‌ఎండీకి నీటి విడుదల
బోయినపల్లి(చొప్పదండి): మిడ్‌మానేరు ప్రాజెక్టు నుంచి ఎల్‌ఎండీకి 3వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ప్రాజెక్టులోకి 7,100 క్యూసెక్కుల మేర వరద ఇన్‌ఫ్లోగా చేరుతోంది. మిడ్‌మానేరు ప్రాజెక్టు నుంచి ప్యాకేజీ–9 మల్కపేటకు 561 క్యూసెక్కుల మేర నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటిమట్టం 27.143 టీఎంసీలకు చేరింది.
నేడు ప్రజావాణి రద్దు
సిరిసిల్ల: జిల్లాలో సోమవారం ప్రజావాణి రద్దు చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ తెలిపారు. భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు, జిల్లాలోని పలు చోట్ల సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్న నేపథ్యంలో ప్రజావాణి రద్దు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రజలు గమనించి సోమవారం ప్రజావాణికి కలెక్టరేట్‌కు రావద్దని నగేశ్ కోరారు.
ముసురు వర్షం
సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా ఆదివారం ముసురు వర్షం కురిసింది. గంభీరావుపేట మండలంలో అత్యధికంగా 30.2 మిల్లీమీటర్ల వర్షం నమోదు కాగా.. రుద్రంగిలో 9.7 మిల్లీమీటర్లు, చందుర్తిలో 2.4, వేములవాడరూరల్‌లో 1.5, బోయినపల్లిలో 3.7, వేములవాడలో 2.8, సిరిసిల్లలో 5.4, కోనరావుపేటలో 4.8, వీర్నపల్లిలో 8.1, ఎల్లారెడ్డిపేటలో 29.7, ముస్తాబాద్‌లో 12.2, తంగళ్లపల్లిలో 4.3, ఇల్లంతకుంటలో 3.3 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 9.1 మిల్లీ మీటర్ల ముసురు వర్షం నమోదైంది.

కాత్యాయినీ నమోస్తుతి

కాత్యాయినీ నమోస్తుతి

కాత్యాయినీ నమోస్తుతి

కాత్యాయినీ నమోస్తుతి