
మద్దిమల్లతండాలో బీసీ మహిళకు చోటు
● ఊరంతా గిరిజనులే.. ● రిజర్వేషన్‌పై అవాకై ్కన పల్లె ప్రజలు
వీర్నపల్లి(సిరిసిల్ల): వీర్నపల్లి మండలంలోని మద్దిమల్ల గ్రామం నుంచి 2018లో మద్దిమల్లతండా విడిపోయి గ్రామపంచాయతీగా ఏర్పడింది. మద్దిమల్లతండా వాసులు అందరూ గిరిజనులే. అయితే సర్పంచ్ స్థానం మాత్రం బీసీలకు కేటాయించడంతో వారు అవాక్కయ్యారు. గ్రామ మాజీ సర్పంచ్ మాలోత్ జవహర్‌లాల్‌నాయక్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ తమ తండాలో 642 జనాభా, 425 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. అందరూ ఎస్టీలేనని.. కానీ సర్పంచ్ స్థానాన్ని బీసీలకు రిజర్వ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఎస్టీలకే ఇవ్వాలని కోరారు.