
మూలవాగు మురిసింది
● ఎములాడ పూలజాతర ● సంబురంగా ఏడొద్దుల సద్దులు ● ఆడిపాడిన ఆడపడచులు
జనసంద్రమైన మూలవాగు
వేములవాడ: సద్దుల సంబురంతో మూలవాగు మురిసింది. ఏడు రోజుల వేడుకతో వేములవాడ పూలవనంలా మారింది. గునుగు..తంగేడు..బంతి..చేమంతి పూలతో పేర్చిన బతుకమ్మలతో ఆడపడచులు శనివారం సాయంత్రం సంతోషంగా ఆడిపాడారు. మూలవాగు తీరానికి భారీగా తరలివచ్చిన జనంతో పూలజాతరగా మారిపోయింది. కిక్కిరిసిన జనం మధ్య బతుకమ్మ పాటలు మరింత సందడిగా మార్చాయి. మధ్యాహ్నం మున్సిపల్ కార్యాలయం నుంచి గౌరమ్మతల్లి విగ్రహాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ నామాల ఉమ, ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, వైస్‌చైర్మన్ రాకేశ్, కమిషనర్ అన్వేశ్, మేనేజర్ సంపత్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేసి మూలవాగులోని బతుకమ్మ తెప్ప వద్ద ప్రతిష్ఠించారు. మూలవాగు ఒడ్డున భారీ శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. జిగేల్ మనిపించే విద్యుత్ కాంతుల నడుమ మహిళలు తరలివచ్చి మూలవాగులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.

మూలవాగు మురిసింది

మూలవాగు మురిసింది

మూలవాగు మురిసింది