
స్కందమాతా అలంకారంలో అమ్మవారు
వేములవాడ: నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాజన్న ఆలయంలోని అమ్మవారు స్కందమాత రూపంలో భక్తులకు శనివారం దర్శనమిచ్చారు. ఆలయంలోని నాగిరెడ్డి మండపంలో ఏర్పాటు చేసిన అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఏటీసీ నైపుణ్య కోర్సులను యువత సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. మండలలోని మండెపల్లి ఐటీఐ కళాశాల ప్రాంగణంలో ఏటీసీ కోర్సులను సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్‌గా శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందదర్‌రెడ్డి, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ వెలుముల స్వరూపారెడ్డి, వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, జిల్లా ఉపాధి కల్పనాధికారి రాఘవేందర్, ప్రిన్సిపాల్ కవిత పాల్గొన్నారు.
సిరిసిల్లకల్చరల్: మధ్యవర్తిత్వం ద్వారా కేసులు త్వరగా పరిష్కారమవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ పేర్కొన్నారు. తెలంగాణ మీడియేషన్, ఆర్బిట్రేషన్ సెంటర్ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వ శిక్షణ పూర్తి చేసుకున్న న్యాయవాదులు శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తితోపాటు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ కుటుంబ తగాదాలు, చెక్‌బౌన్స్ కేసులు, బంధువుల మధ్య స్పర్థలు, ఆస్తి పంపకాల వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించాలని సూచించారు.
సిరిసిల్లకల్చరల్: బతుకమ్మ, విజయదశమి పండుగల నిర్వహణ తేదీలపై సందిగ్ధతకు తెరపడింది. ఈనెల 30న సద్దుల బతుకమ్మ, అక్టోబర్ 2న విజయదశమి(దసరా) పండుగలు నిర్వహించుకోవాలని జిల్లాలోని అన్ని పురోహిత సమాజాలు తీర్మానించాయి. బతుకమ్మ పండుగ తేదీపై సందిగ్ధత తొలగిపోయింది. సిరిసిల్లలో దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మ జరుపుకోవడం ఆచారంగా వస్తోంది. ఈమేరకు పురోహితులు నిర్ణయం తీసుకున్నారు.
కోనరావుపేట(వేములవాడ): హిందువుల ఐక్యతకు పంచపరివర్తన్ ద్వారా ఆర్‌ఎస్‌ఎస్ కృషిచేస్తుందని కరీంనగర్ జిల్లా సహకార్యవాహ ఉచ్చిడి పద్మారెడ్డి పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ వందేళ్ల స్థాపన ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో ధర్మారంలో శనివారం విజయదశమి ఉత్సవాలు నిర్వహించారు. కరీంనగర్ డెయిరీ చైర్మన్ చలిమెడ రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ క్రమశిక్షణ, సేవాగుణం కలగాలంటే పిల్లలను ఆర్‌ఎస్‌ఎస్ శాఖకు పంపించాలని సూచించారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో నేర్పిన క్రమశిక్షణ, అంకితభావంతోనే కరీంనగర్ డెయిరీని అభివృద్ధి చేయగలిగానన్నారు. నగర సహ శారీరక్ ప్రముఖ్ మల్లేశం, ఉపమండల ప్రముఖ్ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

స్కందమాతా అలంకారంలో అమ్మవారు

స్కందమాతా అలంకారంలో అమ్మవారు

స్కందమాతా అలంకారంలో అమ్మవారు