
బాపూజీ జీవితం నవతరానికి ప్రేరణ
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ఎస్పీ మహేశ్ బీ గీతే
ఘనంగా జయంతి వేడుకలు
కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలు వేస్తున్న ఆది శ్రీనివాస్
నివాళి అర్పిస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు
సిరిసిల్లటౌన్: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం వన తరానికి ప్రేరణగా నిలుస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని సిరిసిల్లలో శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన విప్ శ్రీనివాస్ పూలమల వేసి నివాళి అర్పించారు. సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూపారెడ్డి, కాముని వనిత, గోలి వెంకటరమణ పాల్గొన్నారు.
పార్టీలు..ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో..
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ జిందం కళ, మంచె శ్రీనివాస్, దార్నం లక్ష్మీనారాయణ, గూడూరి ప్రవీణ్ పాల్గొన్నారు. బీజేపీ పట్టణాధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పార్టీ పార్లమెంటు కోకన్వీనర్ ఆడెపు రవీందర్, మోర రవి తదితరులు పాల్గొన్నారు.
కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలకు..
సిరిసిల్లక్రైం: దేశ స్వాతంత్య్రోద్యమం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ అలుపెరగని పోరాటం చేశారని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రవి, ఆర్‌ఐలు మధుకర్, రమేశ్, ఏవో పద్మ పాల్గొన్నారు.

బాపూజీ జీవితం నవతరానికి ప్రేరణ