
కలెక్టర్‌గా హరిత
సిరిసిల్ల: జిల్లా కలెక్టర్‌గా ఎం.హరితను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న హరితను రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా నియమించారు. ఇప్పటి వరకు కలెక్టర్‌గా పనిచేసిన సందీప్‌కుమార్ ఝాను తెలంగాణ ఆర్‌అండ్‌బీ స్పెషల్ సెక్రటరీగా నియమించారు. ఈమేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2024 జూన్ 16న జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సందీప్‌కుమార్ ఝా నిత్యం ప్రభుత్వ వైద్యశాలలను, పాఠశాలలను తనిఖీ చేశారు. కొన్ని వివాదాలు చుట్టిముట్టినా విద్య, వైద్యంపై ఆయన పనితీరు గీటురాయిగా తనదైన మార్కును నిలుపుకున్నారు. కోర్టు వివాదాలు, సెప్టెంబరు 17న ప్రొటోకాల్ వివాదం ఆయన బదిలీకి కారణమైనట్లుగా భావిస్తున్నారు. కొత్త కలెక్టర్‌గా నియమితులైన ఎం.హరిత గతంలో వరంగల్‌రూరల్ కలెక్టర్‌గా పనిచేశారు. 2013 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన హరిత జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
హరిత గతంలో..
ఎం.హరిత 2013 ఐఏఎస్ అధికారి. తెలంగాణ కేడర్‌కు చెందిన హరిత విద్యాశాఖ జాయింట్ సెక్రటరీగా, సహకారశాఖ డైరెక్టర్, రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటీవ్ సొసైటీస్‌గా పని చేశారు. 2022లో విద్యాశాఖ డిప్యూటీ సెక్రటరీగా, వరంగల్ రూరల్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు.