
లింగ నిర్ధారణ నేరం
సిరిసిల్ల: గర్భస్థ లింగ నిర్ధారణ నేరమని తెలిసినా కొందరు డాక్టర్లు ప్రైవేటు స్కానింగ్ సెంటర్లలో పరీక్షలను దుర్వినియోగం చేస్తున్నారని జిల్లా వైద్యాధికారి రజిత పేర్కొన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్‌లో శనివారం పీసీపీఎన్‌డీటీ చట్టంపై సలహా సంఘం సమావేశం జరిగింది. రజిత మాట్లాడుతూ గర్భస్త పిండ నిర్ధారణ చేస్తూ పుట్ట బోయేది ఆడబిడ్డ అయితే అబార్షన్లకు పాల్పడుతున్నారన్నారు. ఇలాంటి వారిని గుర్తించి చర్యలు తీ సుకోవాలని కోరారు. బ్రూణహత్యలకు పాల్పడితే టోల్‌ఫ్రీ నంబర్ 94400 54641లో తెలియజేయాలన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్ అంజలి ఆల్ఫ్రెడ్, అధికా రులు సంపత్‌కుమార్, రాజకుమార్ ఉన్నారు.