
రాజకీయాల్లో యువతను ప్రోత్సహించాలి
ఎల్లారెడ్డిపేటలో రౌండ్ టేబుల్ సమావేశం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజకీయాల్లో అన్ని పార్టీలు యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని న్యాయవాది కొండపురం వెంకట్‌రెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్‌కుమార్ కోరారు. మండల కేంద్రంలోని సాయి మణికంఠ గార్డెన్స్‌లో శనివారం వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, మేధావులతో యూత్ ఇన్ పాలిటిక్స్ ఆధ్వర్యంలో రాజకీయంలో యువత అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బానోత్ తిరుపతినాయక్, రవితేజగౌడ్, నరేశ్‌నాయక్, సింగారం దేవరాజు, ప్రమోద్, మధు, ప్రవీణ్, శ్రీనివాస్, అరవింద్, రాము, క్రాంతికుమార్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.