
అధికారుల ఆటా..పాటా
సిరిసిల్ల/సిరిసిల్లకల్చరల్/సిరిసిల్లక్రైం: బతుకమ్మ వేడుకలను జిల్లా అధికారులు శుక్రవారం సాయంత్రం సంబురంగా నిర్వహించుకున్నారు. కలెక్టరేట్‌లో మహిళా ఉద్యోగులు, సిబ్బంది రంగురంగుల పూలతో బతుకమ్మలను సిద్ధం చేశారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా జ్యోతి వెలిగించి వేడుకలు ప్రారంభించారు. జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ, మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి బి.పుష్పలత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్, మొదటి అదనపు సివిల్ జడ్జి కావేటి సృజన, రెండో అదనపు సివిల్ జడ్జి గడ్డం మేఘన బతుకమ్మ ఆట పాటల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎస్పీ మహేశ్ బీ గీతే, అదనపు ఎస్పీ శేషాద్రినిరెడ్డి సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడారు. ఆయా కార్యక్రమాల్లో సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మణాచారి, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, ఆర్డీవో రాధాబాయి, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, డీవైఎస్‌వో రాందాస్, జిల్లా అధికారులు అఫ్జల్‌బేగం, సౌజన్య, లత, భారతి, రవీందర్‌రెడ్డి, రాఘవేందర్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జూపెల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ కార్యాలయంలో ఎస్పీ, పోలీసులు
కోర్టులో బతుకమ్మ ఆడుతున్న జడ్జీలు

అధికారుల ఆటా..పాటా

అధికారుల ఆటా..పాటా