
ఇష్టంతో చదివి ఉన్నతంగా ఎదగాలి
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ● ఎల్లారెడ్డిపేటలో ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన
సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): విద్యార్థులు ఇష్టంతో చదువుకొని వైద్యులు, ఇంజినీర్లు, లాయర్లు, బిజినెస్‌మెన్లుగా ఎదగాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. ఎల్లారెడ్డిపేటలోని ప్రభుత్వ జూని యర్ కాలేజీలో శుక్రవారం నిర్వహించిన పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌కు హాజరై మాట్లాడారు. కళాశాలలో ప్రహరీ, నూతన తరగతి గదుల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి వై.శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.పద్మావతి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ సాబేరబేగం, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో సత్తయ్య పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు పరిశీలన
మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. పలువురి ఇళ్లు స్లాబ్ దశకు చేరుకోగా.. డబ్బులు వచ్చాయా.. అని ఆరా తీశారు. అర్హులు త్వరగా ఇళ్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. మండలంలోని రాచర్లగుండారం– రాచర్లతిమ్మాపూర్ మార్గంలో రోడ్డు కొంత దెబ్బతిందని సీసీరోడ్డు మంజూరు చేయాలని ఎంపీడీవో సత్తయ్యను ఆదేశించారు. నారాయణపూర్‌లోని ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. తరగతి గది తుది దశ పనులు దసరా సెలవులు ముగిసేలోగా పూర్తి చేయాలని సూచించారు.
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి
కలెక్టరేట్‌లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జ్యోతి ప్రజ్వలన చేసి, ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి, నివాళి అర్పించారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సౌజన్య, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం, డీవైఎస్‌వో రాందాస్, రజక సంఘం సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దండు శ్రీని వాస్, మైపాల్ బండి, దండు సురేశ్, వేములవాడ శ్రీనివాస్, మధు, గౌరయ్య, కంసాల మల్లేశం, మారుపాక శ్రీనివాస్ పాల్గొన్నారు.