
ఈ మట్టిలోనే పోరాట పటిమ
కోనరావుపేట(వేములవాడ): భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ ఆత్మగౌరవానికి నిదర్శనమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఐలమ్మ జయంతి సందర్భంగా కోనరావుపేటలో మండల రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ మట్టిలోనే పోరాట పటిమ, తెగువ ఉందన్నారు. పోరాట యోధుల గురించి భావితరాలకు తెలియజేయాలనే కోఠి మహిళా విద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టినట్లు తెలిపారు. కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్‌పాషా, ఏఎంసీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, సింగిల్‌విండో చైర్మన్ బండ నర్సయ్య, చేపూరి గంగాధఽర్, లింబయ్య, రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు.