
సిరిసిల్లలో ‘జోయ్‌అలుక్కాస్’ ప్రదర్శన
● మూడు రోజులపాటు విక్రయాలు
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని వాసవీ కల్యాణ మండపంలో జోయ్ అలుక్కాస్ జ్యువెలరీ సంస్థ శుక్రవారం బిగ్ ప్రదర్శన, సేల్స్ ప్రారంభించింది. సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఎండీ ఖదీర్‌పాషా, మాజీ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. సిరిసిల్లలో శుక్ర, శని, ఆదివారాల్లో మూడు రోజులపాటు ప్రదర్శన కొనసాగుతోందని సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. సిద్దిపేట బ్రాంచ్ పరిధిలోని ఈ ప్రదర్శనలో సరికొత్త సేకరణలు, విశిష్ట ఆభరణాలు అందుబాటులో ఉంటాయని, గొప్ప తగ్గింపు ఆఫర్లతో విక్రయాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు చింతోజు భాస్కర్, సిరిసిల్ల ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు ఆకుల జయంత్‌కుమార్, వాసవీ కల్యాణ మండపం ఇన్‌చార్జి సురేశ్, జోయ్ అలుక్కాస్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.