
ప్రధాన న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు శోచనీయం
సిరిసిల్లకల్చరల్: దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై అనుచిత వ్యాఖ్యలు శోచనీయమని, సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయవాదుల సంఘం డిమాండ్ చేసింది. ఈమేరకు న్యాయవాదులు ఎస్పీ మహేశ్ బీ గీతేను గురువారం కలిసి వినతిపత్రం అందించారు. బార్ అసోసియేషన్ కార్యదర్శి తంగళ్లపల్లి వెంకటి మాట్లాడుతూ సిద్దిపేట కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది పొద్దుటూరి శ్రీకాంత్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ఫొటోను వాట్సాప్‌లో అనుచిత పోస్టు పెట్టారన్నారు. మరో న్యాయవాది ఎం.మరళీమోహన్‌రావు అవమానించేలా వ్యాఖ్యానిస్తూ పోస్టు చేశాడని తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.